- Advertisement -
తన తాజా చిత్రం కే-రాంప్ విడుదలకు (అక్టోబర్ 18, 2025) సిద్ధమవుతున్న సందర్భంలో నటుడు కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరణ్ అబ్బవరం ..సానుభూతితో తన సినిమాలు చూడవద్దని కోరారు.
ఎవరైనా నాపై కనికరంతో సినిమాలు చూడాలని నేను కోరుకోవడం లేదు. నేను సానుభూతి కోరుకునేందుకు రాలేదు. నా సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, ప్రమోలు మీకు నిజంగా నచ్చితేనే థియేటర్‌కి రండి అని తెలిపారు.
తాను బలమైన వ్యక్తిత్వం కలవాడినని, ఎమోషనల్ స్టోరీలు సృష్టించి అటెన్షన్ పొందడం తన ధోరణి కాదని కిరణ్ స్పష్టం చేశారు. కే-రాంప్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిందని, ఈ సినిమా పూర్తిగా కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, సానుభూతి మీద కాదు స్పష్టం చేశారు.
