- Advertisement -

గూగుల్ పెట్టుబడులపై కర్ణాటక మంత్రి

- Advertisement -

ఏపీలో గూగుల్ పెట్టుబడులపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆసక్తికర కామెంట్స్ చేశారు. గూగుల్ విశాఖపట్నంవైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం అందించిన భారీ రాయితీలు అన్నారు. అంతేగాదు సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, యుటిలిటీ ఫీజుల తగ్గింపులు ఓ కారణమని తెలపగా ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నంలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోగా దీనిపై కర్ణాటక మంత్రి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం పనితీరు బాగులేకపోతే నేను ఏమి చేయగలను? విద్యుత్ కోతలు సహా అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని వాళ్ల సొంత పారిశ్రామికవేత్తలే అంటున్నారు అని తెలిపారు. అస్తవ్యస్తమైన విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు లోకేష్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -