ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయు గుండంగా మారిందని ఇది ఈ నెల 27 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని… తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు చేశారు.
ఇటు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… రానున్న ఐదు రోజులు మత్స్య కారులు వేటకు వెళ్లొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు.
వాయుగుండం ప్రభావంతో 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
