ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణా జిల్లాకు చేరుకున్న జగన్‌కు ఘన స్వాగతం లభించింది. పెనమలూరు, పెదన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పంట నష్టాలను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకుని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు జగన్.
ఇక జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. జగన్ కాన్వాయ్ వెళ్ళే మార్గంలో ఇతర వాహనాలను నిలిపివేసి, కేవలం అధికార కాన్వాయ్‌కే అనుమతి ఇచ్చారు. ఇతర వాహనాలను మరల దారి మళ్లించారు.
మహిళా రైతులు జగన్‌ను కలిసి, తుఫాన్ వల్ల నాశనం అయిన అరటి, వరి పంటలను చూపించారు. రైతులు తమ నష్టాలను వివరించిన లిఖితపూర్వక విజ్ఞప్తులను జగన్‌కి అందజేశారు. తాడిగడప వద్ద జగన్‌ను కలవడానికి వచ్చిన రైతులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరి బైక్ తాళాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలను జగన్ దగ్గరనుంచి దూరం చేయలేరు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పాలక కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. వ్యవసాయ మంత్రి ఎక్కడ? అని ప్రశ్నించారు.
