ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్కు హాజరుకానున్న అభిమానుల కోసం కీలక సూచనలు చేశారు. ఈవెంట్ నిర్వహణ, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
ముఖ్యంగా, ఈ ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ కాదని రాజమౌళి స్పష్టం చేశారు. కేవలం ఫిజికల్ పాస్లు ఉన్న అభిమానులకు మాత్రమే ఈవెంట్కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఈవెంట్ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసివేస్తారని కాబట్టి, పాస్లు లేని వారు రావద్దని సూచించారు.
ముఖ్యంగా, భద్రతా నిబంధనల దృష్ట్యా, 18 సంవత్సరాల లోపు వారికి, అలాగే సీనియర్ సిటిజన్లకు ఈవెంట్కు అనుమతి లేదని రాజమౌళి వెల్లడించారు.
అభిమానుల సౌలభ్యం కోసం, విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వారు వారి పాస్ మీద ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ లభిస్తుందని తెలిపారు. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరవబడతాయని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. అభిమానులు ఈ సూచనలను పాటించి, సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
