- Advertisement -

జేడీయూ ఎల్పీ నేతగా నితీష్..కేబినెట్ ఇదే!

- Advertisement -

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నామినేట్ అయిన నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్(JDU) శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం పాట్నాలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల అంతర్గత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇవాళ నితీష్ కుమార్ కూటమి శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నిక కానున్నారు. నవంబర్ 20న ఆయన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో ఉదయం 11:30 గంటలకు జరగనుంది. 2025 బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయాన్ని నమోదు చేసింది. 243 స్థానాలకు గాను 202 స్థానాలను గెలుచుకుంది. మహాఘటబంధన్ కేవలం 35 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో బీజేపీ నుండి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంగళ్ పాండే, నితీష్ మిశ్రా, నితిన్ నవీన్, రేణు దేవి, నీరజ్ కుమార్ బబ్లూ, సంజయ్ సరవగి, రజనీష్ కుమార్‌, జేడి (యు) నుండి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి, రత్నేష్ సదా, సునీల్ కుమార్, శ్యామ్ రజక్, జమా ఖాన్, లేసి సింగ్, దామోదర్ రావత్, రాజు తివారీ (ఎల్‌జేపీ-రామ్ విలాస్), సంతోష్ కుమార్ సుమన్ (హెచ్‌ఏఎం), స్నేహలత కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎం) ఉన్నట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ : 89, జనతాదళ్ (యునైటెడ్) : 85, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) : 19, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) : 5, రాష్ట్రీయ లోక్ మోర్చా : 4, ప్రతిపక్ష పార్టీలలో రాష్ట్రీయ జనతాదళ్ 25, భారత జాతీయ కాంగ్రెస్ 6, సిపిఐ (ఎంఎల్)(ఎల్) 2, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ 1, సిపిఐ (ఎం) 1 స్థానాలు గెలుచుకున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 5, బహుజన్ సమాజ్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -