- Advertisement -

ఉన్నావ్ కేసు..సుప్రీం కీలక ఆదేశాలు

- Advertisement -

ఉన్నావ్‌ అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సోమవారం స్టే చేసింది. మరో నేరంలో కూడా దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఇలాంటి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి సెంగార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ఉన్నావో అత్యాచార కేసులో కుల్దీప్ సెంగార్ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది.

అయితే డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్, జస్టిస్ హరిష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బాధితురాలి తరఫు న్యాయవాది హేమంత్ కుమార్ మౌర్యా సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెంగార్ జైలు నుంచి విడుదల కాడని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులకు స్టే విధించినందున, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే వరకు కూడా అతడికి ఉపశమనం ఉండదని తెలిపారు.
మహిళా హక్కుల కార్యకర్త యోగిత భయానా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అభినందించారు. సత్యమేవ జయతే. ఈ ఉత్తర్వును ఆశించాం. దేశంలోని ప్రతి అమ్మాయికి అన్యాయం జరిగితే న్యాయం దొరుకుతుందన్న నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది అని ఆమె అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -