న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌కు మాజీ భారత క్రికెటర్ పార్థివ్ పటేల్ ప్రశంసలు కురిపించారు. 26 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేసిన సూర్యకుమార్, 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, సిరీస్‌ను కూడా భారత్ కైవసం చేసుకునేలా చేశారు.
రెండో టీ20లోనూ అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్, మూడో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించడంతో తన ఫామ్ తిరిగి వచ్చిందని స్పష్టమైంది. ఈ ప్రదర్శనపై స్పందించిన పార్థివ్ పటేల్, కొద్ది మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లు వచ్చినా, ఒక మంచి ఇన్నింగ్స్ ఆటగాడిని మళ్లీ గాడిలో పెట్టడానికి సరిపోతుందని అన్నారు.
ఇదే గొప్ప ఆటగాళ్ల ప్రత్యేకత. ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఒక్క మంచి ఇన్నింగ్స్ చాలు. ఆ ఒక్క ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత దానిపై నిర్మించుకునే సామర్థ్యం వారికి ఉంటుంది. ఈ రెండు ఇన్నింగ్స్‌కు ముందు సూర్యకుమార్ బ్యాటింగ్ విధానానికి, ఈరోజు అతడు ఆడిన తీరుకు మధ్య భారీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది అని తెలిపారు.
ఒకసారి ఫామ్‌లోకి వస్తే సూర్యకుమార్‌ను ఔట్ చేయడం చాలా కష్టమని మరో ఆటగాడు చాహల్ అన్నాడు.
