- Advertisement -

మాజీ మంత్రి జోగి రమేశ్‌పై కేసు నమోదు

- Advertisement -

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేశ్‌పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లపై జోగి రమేశ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీసీకి సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే సమయంలో, జోగి రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు నిన్న సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడంతో పాటు, రాళ్లు విసిరి ఆందోళనకు దిగారు. కొందరు కార్యకర్తలు జోగి రమేశ్ ఇంటికి నిప్పటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘర్షణ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -