మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టి, ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రాబోయే తమిళ చిత్రం D55లో నటిస్తున్నట్టు అధికారికంగా ఖరారైంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో మమ్ముట్టి తిరిగి తమిళ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం.
చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు విడుదల చేసిన ఓ రహస్య పోస్టర్‌లో మీరు అన్నీ చూసేశామనుకుంటున్నారు… కానీ ఇంకా పెద్దది రాబోతోంది. అత్యంత ఎదురుచూస్తున్న ‘M’… అద్భుతమైన ‘M’!!!” అని పేర్కొనడంతో, మమ్ముట్టి ఈ చిత్రంలో భాగమవుతున్నారని అభిమానులు ముందే ఊహించారు.
ఈ అప్డేట్‌ను ప్రకటిస్తూ చిత్ర బృందం ఎక్స్ (X) వేదికగా బిగ్ ఎం (Big M) ఒక కథను ఎంచుకుంటే, అది చరిత్రగా మారుతుంది. మెగాస్టార్ @mammukka ను #D55లోకి స్వాగతించడంలో ఎంతో ఆనందంగా ఉంది. ఇది మా కోసం గౌరవం. ధన్యవాదాలు మమ్ముట్టి సర్ అని పోస్ట్ చేసింది.
D55తో మమ్ముట్టి ఏడేళ్ల విరామం తర్వాత తమిళ చిత్రాల్లో కనిపించనున్నారు. ఆయన చివరిసారిగా 2019లో విడుదలైన విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పెరన్‌బు’ చిత్రంలో నటించారు. ఆయన చేరిక ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన వుండర్‌బార్ ఫిల్మ్స్ సంస్థ, ఆర్‌టేక్ స్టూడియోస్ సహకారంతో నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ బ్యానర్‌పై అన్బుచెళ్జియన్, సుష్మిత అన్బుచెళ్జియన్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత నిర్మాణ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి.
