టీ20 వరల్డ్ కప్‌లో భారత్ – పాక్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్దానికి మరో 24 గంటల్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారుల మధ్య కీలక సమావేశం అనంతరం భారత్–పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌పై 24 గంటల్లో పరిష్కారం దొరికే అవకాశముందని తెలుస్తోంది. చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పీసీబీ …పాకిస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనుంది. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, భారత్–పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ వివాదంపై చర్చించేందుకు ఐసీసీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖ్వాజా, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ, బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం లాహోర్‌లో సమావేశమయ్యారు. గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఈ త్రైపాక్షిక భేటీతో భారత్–పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలపై ఆశలు పెరుగుతున్నాయి.
అయితే, పీసీబీ కొన్ని డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. ఐసీసీ ఆదాయంలో పీసీబీ వాటా పెంచడం, భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణ, అలాగే హ్యాండ్‌షేక్ పాలసీ అమలు వంటి డిమాండ్లు బోర్డు ముందుంచినట్లు తెలుస్తోంది. ప
ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం వరల్డ్ కప్‌లో జాతీయ జట్టు పాల్గొనడానికి అనుమతి ఇచ్చినా, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే గ్రూప్ దశ భారత్ మ్యాచ్‌లో ఆడవద్దని ఆదేశించినట్లు సమాచారం. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఐసీసీకి, ప్రసారకర్తలకు అత్యంత వాణిజ్యపరంగా కీలకమైనదిగా పరిగణిస్తారు. ఈ మ్యాచ్ లేకపోతే శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ), ప్రసారకర్తలు సహా అనేక భాగస్వాములపై ప్రభావం పడనుంది.
