డ సంచలనంగా మారింది. ఆయనతో పాటు మరో కీలక నేత రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 16 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం విశేషం.
తిప్పరి తిరుపతి స్వస్థలం పెద్దపల్లి జిల్లా. నంబాల ఎన్కౌంటర్ అనంతరం పార్టీకి దేవ్జీ సారథ్యం వహించినట్లు సమాచారం. ఆయన లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బగా భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు చేపట్టిన “ఆపరేషన్ కగార్” నేపథ్యంలో మావోయిస్టులపై ఒత్తిడి పెరిగింది. అడవుల్లో సాగుతున్న కాంబింగ్ ఆపరేషన్లు, నిధుల కొరత, కేడర్లో అసంతృప్తి వంటి కారణాలతోనే ఈ లొంగుబాట్లు జరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస పథకాలు అమలు చేస్తుందని అధికారులు తెలిపారు. శాంతి మార్గం ఎంచుకోవడం మంచిదని, మిగిలిన కేడర్ కూడా హింసా మార్గాన్ని విడిచి ముందుకు రావాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ పరిణామం రాష్ట్రంలో అంతర్గత భద్రతా పరిస్థితులపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
