ఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి, అవసరమైన సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏపీ హెల్ప్‌లైన్స్: 0863-2340678, వాట్సాప్: +91 8500027678.
ఇక ఇరాన్‌లో తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఖమేనీ మృతి అనంతరం అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతుండగా, అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయనే నివేదికలు వెలువడుతున్నాయి. కేంద్ర హోంశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ఇదిలా ఉండగా, దుబాయ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రధాని మోదీ చర్యలతో భారత్‌లోనూ యుద్ధ ముప్పు తలెత్తే అవకాశం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.
