సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ఓ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళ తనను బాధితురాలిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె..బీఆర్ నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది.
తనతో దాదాపు 30 ఏళ్లుగా వ్యక్తిగత సంబంధం కొనసాగిస్తూ ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. తన అనారోగ్యంతో ఉన్న కూతురు భవిష్యత్తు కోసం ఇంతకాలం సహించాల్సి వచ్చిందని పేర్కొంది. మహిళలను లోబర్చుకోవడమే ఆయన పని అని, సహకరించకపోతే ఎలాంటి సహాయం చేయరని ఆమె ఆరోపణల్లో చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. బాధితురాలితో సన్నిహితంగా ఉన్నట్లు చెప్పబడుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశముంది. టీటీడీ వంటి విశ్వాసపూరిత సంస్థ ప్రతిష్ట దృష్ట్యా ప్రభుత్వం త్వరగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. ఆరోపణల నిజానిజాలు బయటపడేందుకు సమగ్ర విచారణ అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.



