- Advertisement -

మరోసారి బాబీ దర్శకత్వంలో మెగాస్టార్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సమాచారం.

ఈ సినిమా కొన్ని వారాల క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ను మార్చి 14, 2026న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించే అవకాశముంది. అధికారిక ప్రకటన త్వరలోనే చిత్రబృందం నుంచి వచ్చే అవకాశముంది.

ఇది చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రం కావడం విశేషం. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు సినిమా. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిమిష్ రవి నిర్వహించనుండగా, సంగీతాన్ని తమన్ అందించనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రారంభోత్సవ వేడుకలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో చిరంజీవి స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -