- Advertisement -

Nag 100 మూవీ అప్‌డేట్!

- Advertisement -

కింగ్ నాగార్జున తన వందో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్‌తో సినిమాకు ఓకే చెప్పారు నాగార్జున. షూటింగ్ వేగంగా జరుగుతుండగా, ఈ మైలురాయి చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రా. కార్తిక్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నాగార్జున చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తారని చెప్పారు. ఈ చిత్రంలో నాగార్జున సర్‌ను మీరు ఎంతో స్టైలిష్‌గా చూడబోతున్నారు. శివ,కూలీ సినిమాల్లో కనిపించిన స్టైలిష్ లుక్‌ల మాదిరిగా, ఈ సినిమాలో కూడా పలు గెటప్‌లలో కనిపిస్తారు అని తెలిపారు.

తన 100వ సినిమాకు తెలుగు దర్శకుడిని కాకుండా తనలాంటి తమిళ దర్శకుడిని ఎందుకు ఎంపిక చేశారో అని నాగార్జునను అడిగానని, కానీ ఆయనకు అది పెద్ద విషయం కాదని దర్శకుడు చెప్పారని కార్తిక్ వెల్లడించారు.

ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారని టాక్. నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -