- Advertisement -

నాగార్జున కాళ్ల‌పై ప‌డి ఏడ్చిన అఖిల్

- Advertisement -

ఎన్నో రోజులుగా అఖిల్ అక్కినేని కోసం వేచి చూస్తున్న అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఆయన హీరోగా నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో ఒక మంచి చిత్రంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అఖిల్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని, ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్‌లు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కథా కథనాలు, యాక్షన్ సన్నివేశాలు అక్కినేని అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి.

సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సక్సెస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో అఖిల్ భావోద్వేగానికి గురయ్యారు. తన విజయంలో వెన్నుదన్నుగా నిలిచిన తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి, ఆయన్ను గట్టిగా హత్తుకున్నారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. తండ్రికి తన కృతజ్ఞతను చాటుకున్న అఖిల్ తీరు చూసి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘లెనిన్’ చిత్రం అఖిల్ కెరీర్‌కు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు అఖిల్‌ను సరికొత్తగా ఆవిష్కరించారని, రూరల్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మరింత వసూళ్లను సాధిస్తుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -