- Advertisement -

చంద్రబాబుకు ప్రాక్సీలా షర్మిల!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాక్సీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

షర్మిల ఎన్నికల్లో ఖర్చు చేసిన నిధులపై పలు ప్రశ్నలు ఉన్నాయని, కానీ వాటికి ఆమె సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోరు మరింత వ్యక్తిగతంగా మారుతోందని, ప్రతిపక్షాల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ నేతలు మరో ఆరోపణ చేస్తూ, షర్మిల వ్యాఖ్యలను ఎల్లో మీడియా హైలైట్ చేస్తోందని పేర్కొన్నారు.ఇటీవల కాలంలో షర్మిల, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. మొత్తానికి, షర్మిలపై వచ్చిన ఈ ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -