- Advertisement -

డ్రగ్స్ వ్యవహారం..పుట్టా సుధాకర్ సంచలనం

- Advertisement -

డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న వేళ, ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు పుట్టా మహేష్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడిపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. 2021లో మహేశ్‌కు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆ తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ తీసుకోవడం అసంభవమని అన్నారు.

డ్రగ్స్ పరీక్షల ప్రక్రియపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లడ్ సాంపిల్ తీసుకోకుండా డ్రగ్ పాజిటివ్ ఎలా వస్తుందో ప్రశ్నించారు. సాధారణంగా రక్త నమూనా పరీక్షలకు కనీసం 48 గంటల సమయం పడుతుందని, కానీ యూరిన్ సాంపిల్స్ తీసుకుని కేవలం 5 నిమిషాల్లోనే ఫలితాలు ప్రకటించారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పార్టీ అధిష్టానానికి ఇప్పటికే పూర్తి వివరణ ఇచ్చామని తెలిపారు. నిజాలు వెలుగులోకి వస్తాయని, తన కుమారుడు నిర్దోషి అని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో డ్రగ్స్ వ్యవహారం మరింత వేడెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -