- Advertisement -

ఓటీటీలోకి ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్‌!

- Advertisement -

బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3 ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్రాంచైజీ మూడో భాగంలోరాణి ముఖర్జి ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు అభిరాజ్ మీనావాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ హిందీ చిత్రం మార్చి 27, 2026 (శుక్రవారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర భాషల్లో విడుదల చేసే ప్రణాళికలు లేవని సమాచారం.

‘మర్దానీ’ ఫ్రాంచైజీలో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన భాగంగా నిలిచింది. ఈ సినిమాలో జానకి ,జిష్షు,ఇంద్రనీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జాన్ స్టీవెర్ట్ అందించారు.

మొత్తంగా, థియేటర్లలో మంచి స్పందన పొందిన ‘మర్దానీ 3’ ఇప్పుడు ఓటీటీలోకి రానుండటంతో, ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఇంట్లోనే వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -