- Advertisement -

రాజధానిపై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రణాళికలపై విమర్శలు గుప్పిస్తూ, ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ అనే ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు.

తమ్మినేని సీతారాం మాట్లాడుతూ…ప్లాన్ బి గా ‘మావిగన్’ను అమలు చేస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగే రాజధానిని నిర్మించవచ్చని తెలిపారు. అమరావతిపై భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, దానికి ఖర్చు చేస్తున్న మొత్తం లో కేవలం 10 శాతం వెచ్చించినా మావిగన్ నెంబర్ వన్ రాజధానిగా మారుతుందని అన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. “అంత సరళమైన ఆలోచన కూడా చంద్రబాబుకు లేదా?” అంటూ ప్రశ్నించారు.రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని పేరుతో మరింత ఆర్థిక భారం మోపడం సరికాదని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు రాష్ట్ర పరిస్థితి మారుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈ వ్యాఖ్యలపై స్పందనలు వచ్చే అవకాశముంది.మొత్తానికి, తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -