- Advertisement -

రాజధాని పేరుతో స్కాం..రైతులకు అండగా ఉంటా!

- Advertisement -

రాజధాని పేరుతో చంద్రబాబు ఏది చేసినా స్కామే కనిపిస్తోంది అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. అమరావతి రాజధాని పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. మిగతా చోట్ల చదరపు అడుగుకు అత్యధికంగా రూ.4500 అవుతుంటే అమరావతిలో రూ.20వేలు ఖర్చు చేస్తూ రూ.20కోట్లు అయ్యే రోడ్డుకు రూ.53 కోట్లు అంటూ అవినీతి చేస్తున్నాడు అన్నారు. ఈ పెట్టే ఖర్చులో కొంత మావిగన్ కు పెడితే రాజధాని ఇప్పుడే సిద్ధం అవుతుంది. మన ప్రభుత్వం వచ్చాక రైతులకు ఏం కావాలో అదే చేస్తాం. బలవంతపు భూసేకరణ అనేది ఉండదు. అలాగే రాజధాని రైతులకు అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం అన్నారు.

రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం…. రైతులకు సంతోషపెట్టేలా ఏదైనా జరగాలి….. వారిని కష్టపెట్టేలా ఏమీ ఉండకూడదుదని జగన్ అన్నారు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్‌ను సూచించామని జగన్ పేర్కొన్నారు.

వైఎస్ జగన్ ను కలిసిన తరువాత రాజధాని రైతులు మాట్లాడుతూ.. మా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ ఉండటం లేదు. ఎమ్మెల్యే, మంత్రి, అధికారులు ఎవరూ కలవడానికి అవ్వడం లేదు అని చెప్పుకొచ్చారు. ఉండవల్లిలో పండని పంటలు లేవు.. అలాంటి పొలాలను ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఏడాది పొడవునా పంటలు పండుతాయి. ఎకరానికి 3లక్షలు సంపాదిస్తాం అన్నారు. మా బాధలన్నీ వైఎస్ జగన్ కు చెప్పుకున్నాం…. భూసేకరణ నుండి మా భూములు తప్పించండని వేడుకుంటున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -