- Advertisement -
ఎర్రచందనంపై తీసిన డాక్యుమెంటరీ విషయంలో వెనక్కి తగ్గింది జావా డిస్కవర్. ఎర్రచందనంపై తీసిన డాక్యుమెంటరీని తొలగించింది ఛానల్. తప్పుడు కథనం ప్రసారం చేసి పరువుపోగొట్టుకుంది జావా డిస్కవర్.
డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ ఫొటోను తప్పుగా చూపించింది ఛానల్. దీనిపై అభ్యంతరం తెలుపుతూ నోటీసులు పంపింది వైసీపీ. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ తీశారు.
జర్నలిస్టు సుధాకర్ రెడ్డి రాయని అంశాన్ని ప్రస్తావించింది జావా డిస్కవర్ ఛానల్. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విషప్రచారం చేయగా దీనిపై లీగల్ చర్యలకు దిగారు సుధాకర్ రెడ్డి. తప్పు తెలుసుకుని డాక్యుమెంటరీని తొలగించింది ఆ ఛానల్. తప్పుడు సమాచారంతో వైఎస్ జగన్ ను ట్రోల్స్ చేసి అభాసుపాలయింది టీడీపీ.

