పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలుకానుంది. తొలిసారి బెంగాల్ చరిత్రలో బీజేపీ సర్కార్ కొలువుదీరనుండగా సీఎంగా సువేందు అధికారి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించినప్పటి నుండి సువేందు అధికారి బెంగాల్ బీజేపీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. క్షేత్రస్థాయిలో ఆయనకున్న పట్టు పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్.
బెంగాల్ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఏకం చేయడంలో, టీఎంసీని ధీటుగా ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం మరియు పార్టీ పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత ఆయనను రేసులో ముందుంచాయి.
రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలను సమతుల్యం చేయడానికి మరియు పరిపాలనను మరింత వేగవంతం చేయడానికి బీజేపీ “ముగ్గురు సభ్యుల ఫార్ములా”ను అమలు చేయవచ్చని సమాచారం. సీఎంతో పాటు ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాతావా కమ్యూనిటీ లేదా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన ఒక నేతకు ఈ కీలక పదవిని అప్పగించి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని పార్టీ భావిస్తోంది.
దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న టీఎంసీ ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే, అది జాతీయ రాజకీయాల్లోనూ పెను మార్పులకు నాంది పలికింది.
