- Advertisement -

మంత్రి లోకేష్‌కు విద్యార్థి వాట్సాప్ లేఖ‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థి వాట్సాప్ లేఖ‌ వాట్సాప్ ద్వారా లేఖ పంపి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు విడుదల కాకపోవడంతో చదువు కొనసాగించడం కష్టంగా మారిందని పేర్కొన్నాడు.

విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం, కాలేజ్ యాజమాన్యం రూ.32 వేల ఫీజు వెంటనే చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తోందట. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో తామే ఫీజు చెల్లించాలని చెబుతున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వబోమని కాలేజ్ హెచ్చరించినట్లు తెలిపాడు.

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఒకేసారి అంత పెద్ద మొత్తం చెల్లించే స్థోమత లేదని విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు. చదువు మధ్యలో ఆగిపోతుందేమోనని భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు రూ.10,200 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితి కారణంగా వేలాది మంది విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

విద్యార్థి పంపిన ఈ వాట్సాప్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు విద్యార్థుల్లో ఆసక్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -