- Advertisement -

నిప్పుల కుంపటిలా ఆంధ్రప్రదేశ్..!

- Advertisement -

భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు పగటిపూట కర్ఫ్యూను వాతావరణం తలపిస్తోంది. రానున్న ఐదు రోజులు ఏపీలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. మరో 137 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల మార్కాపురం ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు పోలవరం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు వేడి ఉంటుంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

అయితే ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రయాణాలు చేసే వారు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -