- Advertisement -

కుప్పంలో 20వేల టీడీపీ బోగస్ ఓట్లు!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో SIR మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో SIRపై వైసీపీ నేతలకు అవగాహన కల్పించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌. ఈ సందర్భంగా కుప్పంలో 20 వేల పైచిలుకు టిడిపి బోగస్ ఓట్లు ఉన్నట్లు తెలిపారు.

ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తుంది.. లిస్టులో తండ్రి పేరు చూసినా, భర్త పేరు చూసినా సేమ్ ఉంటుంది… ఇదే కుప్పంలో మనకు కళ్లెదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ అని ఓపెన్ అయ్యారు జగన్.

ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళని ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి… కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.

SIR స‌ర్వే ప‌ట్ల వైసీపీ క్యాడ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండాలి అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో 91 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గిస్తే.. #TMC ఓడిపోయింది 31 ల‌క్ష‌ల తేడాతో..త‌మిళ‌నాడులో 74 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొలగిస్తే.. #DMK ఓడింది 17 ల‌క్ష‌ల తేడాతో ఓడిపోయారన్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేసిన భ‌వానీపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 45,982 ఓట్లు తొల‌గిస్తే.. 15 వేల ఓట్ల‌తో ఆమె ఓడిపోయారు… స్టాలిన్ పోటీ చేసిన కొల‌తూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 71 వేల ఓట్లు తొల‌గిస్తే.. 8 వేల ఓట్ల‌తో ఆయ‌న ఓడిపోయారు అన్నారు.

ఏపీలో SIRని సీరియస్‌గా తీసుకుని.. పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైయస్ జగన్ గారు సూచన ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి తోడుగా ఉండాలి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలు చేసినా.. మన అభ్యర్థిని గెలిపించాలి అని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -