- Advertisement -

మోదీ.. డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పెద్ది’!

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే భోపాల్.. బెంగళూరు నగరాలలో ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్.. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్.. జాన్వీ కపూర్.. దివ్యేందు శర్మ.. బోమన్ ఇరానీ పాల్గొన్నారు.

ఈ వేదికపై రామ్ చరణ్ మాట్లాడుతూ గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని ఇంతకుముందు కలిసినప్పుడు ‘పెద్ది’ సినిమా దేని గురించి అని అడిగారని.. దానికి సమాధానంగా తానే ఒక విధంగా ఇది వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించానని చరణ్ చెప్పారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఒక స్ఫూర్తినింపే కథను తనతో పంచుకున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక గ్రామానికి చెందిన మహ్మద్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు భారత్ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడని.. అతని వల్ల ఇప్పుడు ఆ గ్రామం నుంచి 85 మంది ప్లేయర్స్ తయారయ్యారని మోదీ తనకు వివరించినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలడు అనేదానికి ఆ కథ నిదర్శనమని.. సినిమాలో పెద్ది పాత్ర కూడా అలాంటిదేనని చరణ్ స్పష్టం చేశారు. ఇక సినిమాలో ఇంత బాగా డ్యాన్స్ ఎలా చేశారు అని ప్రశ్నించగా.. నిర్మాత తనకు మంచి పారితోషికం ఇచ్చారంటూ చరణ్ నవ్వులు పూయించారు.

హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ తెరపై కనిపించే రామ్ చరణ్‌కు.. తెరవెనుక ఉండే చరణ్‌కు అస్సలు పోలిక ఉండదన్నారు. బయట ఆయన చాలా కూల్‌గా ఉంటారని ప్రశంసించారు. నటుడు బోమన్ ఇరానీతో కలిసి నటించాలనే తన డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. తన పాత్ర విషయంలో దర్శకుడు బుచ్చిబాబు సన చెప్పిందే తాను ఫాలో అయ్యానని.. చిత్ర యూనిట్ అంతా బుచ్చిబాబుకు పెద్ద ఫ్యాన్స్ అని జాన్వీ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -