- Advertisement -

జూన్ 1 నుండి కొత్త UPI రూల్స్!

- Advertisement -

జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త యూపీఐ రూల్స్ రాబోతున్నాయి. అలాడే కొత్తగా అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2025 కింద అడ్వాన్స్‌ గడువు నుండి యూపీఐ (UPI) యాప్‌లలో మోసాలను అరికట్టే నిబంధనల వరకు ఎన్నో మార్పులు జరగబోతున్నాయి.

()పన్ను చెల్లింపుదారులు జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులను గమనించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ .. ఆర్థిక సంవత్సరం 2026-27కు గాను మొదటి ముందస్తు పన్ను వాయిదా చెల్లించడానికి 15 జూన్ 2026 ఆఖరి తేదీ. నికర పన్ను రూ. 10,000 దాటే వారు ఈ తేదీ లోగా 15 శాతం పన్ను చెల్లించాలి. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 మరియు ఐటీ రూల్స్ 2026 కింద పూర్తిగా సాగుతున్న మొదటి అడ్వాన్స్ టాక్స్ సైకిల్ ఇది. ఈ గడువు తప్పితే నెలకు 1 శాతం వడ్డీ జరిమానా పడుతుంది.

ఉద్యోగులకు ఊరట పిల్లల చదువు కోసం పన్ను మినహాయింపును నెలకు రూ. 100 నుండి రూ. 3,000 కి పెంచారు. హాస్టల్ అలవెన్స్ మినహాయింపు నెలకు రూ. 9,000 కి పెరిగింది. హెచ్‌ఆర్‌ఏ (HRA) పరిధిలోకి బెంగళూరు, పుణె, హైదరాబాద్, మరియు అహ్మదాబాద్ నగరాలను అధికారికంగా 50 శాతం ఇంటి అద్దె భత్యం (HRA) మినహాయింపు కేటగిరీలోకి చేర్చారు.

()డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక పారదర్శకమైన అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. ఇకపై మీరు క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేసినప్పుడు లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు.. సదరు వ్యక్తి బ్యాంక్ ఖాతాలో నమోదైన అసలు పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనివల్ల నకిలీ పేర్లతో మోసం చేయడం సాధ్యపడదు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే వేగవంతమైన సదుపాయాన్ని తీసుకురాబోతోంది. కొన్ని వాణిజ్య బ్యాంకులు తమ సేవా రుసుములను మారుస్తున్నాయి. దీనివల్ల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ, మినీ-స్టేట్‌మెంట్ మరియు బ్యాలెన్స్ ఎంక్వైరీలకు అదనపు చార్జీలు పడే అవకాశం ఉంది.

() ప్రతి నెలా 1వ తేదీన జరిగే సమీక్షలో భాగంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ (LPG), సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) ధరలను సవరించనున్నాయి. గత నెలలో కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల ధరలపై మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సంప్రదాయ పొదుపుదారుల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వడ్డీ రేటును 7.1 శాతం గాను, సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేటును 8.2 శాతం గాను ఈ త్రైమాసికానికి ప్రభుత్వం స్థిరంగా ఉంచింది.

()భారీ లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డ్ నిబంధనలు మారాయి. సాధారణ రోజువారీ రూ. 50,000 పైబడిన నగదు డిపాజిట్లకు ఇకపై పాన్ కార్డు తప్పనిసరి కాదు.ఆస్తుల విక్రయానికి సంబంధించి పాన్ సమర్పించాల్సిన పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచారు. అయితే రూ. 45 లక్షలు దాటే ఆస్తి ఒప్పందాలు, గిఫ్ట్ డీడ్‌లు, జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లకు పాన్ కార్డ్ తప్పనిసరి. అలాగే ఏడాదికి రూ. 10 లక్షలు దాటి నగదు ఉపసంహరణలు చేస్తే ఆటోమేటిక్‌గా ఐటీ శాఖకు రిపోర్ట్ వెళ్తుంది.

()క్లీన్ ఎనర్జీ రంగంలో జూన్ 1 నుండి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ప్రభుత్వం ఇచ్చే బ్సిడీ ఉన్న అన్ని సోలార్ ప్రాజెక్టులలో కేవలం Approved List of Models and Manufacturers (ALMM) జాబితాలో ఆమోదించబడిన సోలార్ మాడ్యూళ్లను మాత్రమే ఉపయోగించాలి. దీనికి ఎలాంటి గడువు పొడిగింపు లేదు. దీనివల్ల తాత్కాలికంగా సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగినప్పటికీ దేశీయ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నాణ్యత పెరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -