- Advertisement -

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ పోరాటం..

- Advertisement -

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో అడుగడుగునా అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరం చేసింది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైసీపీ యూత్ నేతలు ఆరోపించారు. కూటమి నాయకులు ఉద్యోగాలను అంగడి సరుకుల్లా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు.

ఈ మెగా డీఎస్సీ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ మ్యూజియం రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ నిరసనలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్…ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, యూత్ వింగ్ నాయకులు పాల్గొని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మరోవైపు అనంతపురంలో కూడా డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ భారీ ధర్నా చేపట్టింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని నేతలు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -