భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్న చిత్రాలలో టాలీవుడ్ నుండి వస్తున్న వారణాసి (Varanasi), బాలీవుడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ (Ramayana) మొదటి వరుసలో ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఐమ్యాక్స్ (IMAX) చిత్రాలుగా రాబోతున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ భారీ చిత్రాల బడ్జెట్ లెక్కలపై ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల బాలీవుడ్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ఈ తరం భారీ సినిమాల బడ్జెట్ అంకెలన్నీ కేవలం పీఆర్ స్టంట్లు (PR Stunts) మాత్రమేనని కొట్టిపారేశారు. “ఇలాంటి వందల కోట్ల భారీ బడ్జెట్ నెంబర్స్ అన్నీ కేవలం సినిమాలపై హైప్, క్రేజ్ పెంచడానికి పీఆర్ టీమ్స్ ఉపయోగించే జిమ్మిక్కులు. గత పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఇదే తంతు నడుస్తోంది” అంటూ ఆయన ఓపెన్ గా కామెంట్స్ చేశారు. మనోజ్ లాంటి ఒక జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు వారణాసి, రామాయణ లాంటి మోస్ట్ అవైటెడ్ సినిమాల బడ్జెట్లను తక్కువ చేసి మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, మనోజ్ బాజ్‌పాయ్ నుండి సడెన్‌గా ఈ స్థాయి వివాదాస్పద వ్యాఖ్యలు రావడానికి ఒక బలమైన కారణం ఉందంటూ నెటిజన్లు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గవర్నర్’ (Governor) విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు మార్కెట్లో కనీస స్థాయిలో కూడా బజ్ (Buzz) లేకపోవడంతో.. ఈ ప్రమోషన్స్ ఈవెంట్లో కావాలనే ఇలాంటి షాకింగ్ స్టేట్మెంట్లు ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. పెద్ద సినిమాలను టార్గెట్ చేయడం ద్వారా మీడియా అటెన్షన్ ని తన వైపు తిప్పుకుని, తద్వారా ‘గవర్నర్’ సినిమాకు బూస్టప్, ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవాలనేదే మనోజ్ ప్లాన్ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
