- Advertisement -

ఆపరేషన్ తెలంగాణ…బీజేపీ ఫోకస్!

- Advertisement -

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తలెత్తిన భారీ రాజకీయ సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మాజీ సీఎం మమతాపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయగా ఎంపీలు సైతం అదేబాటలో నడిచారు. దీంతో మమత చేతిలో నుండి తృణమూల్ వెళ్లిపోనుంది. బెంగాల్ తర్వాత ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తన తదుపరి ప్రధాన లక్ష్యంగా తెలంగాణను ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బెంగాల్ తరహా వ్యూహాన్నే తెలంగాణలోనూ అమలు చేయడానికి బీజేపీ అడుగులు వేస్తోంది.

ప్రాంతీయ పార్టీల అంతర్గత బలహీనతలను ఉపయోగించుకుని అసంతృప్త నేతలను ఆకర్షించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది.గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో గణనీయమైన స్థానాలను గెలుచుకోవడం ద్వారా వచ్చిన ఊపును అలానే కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం నిశ్చయించుకుంది.

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్- ప్రతిపక్షమైన బీఆర్ఎస్ లోని కీలక నేతలను ముఖ్యంగా లోకల్ క్యాడర్‌లో పట్టున్న బలమైన నాయకులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగవంతం చేయాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల పర్యటనలను మరియు భారీ బహిరంగ సభలను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే బీజేపీ హైకమాండ్ వ్యూహాం బాగానే ఉన్న పార్టీ ఎంపీల మధ్య ఉన్న అంతర్గతపోరు ఆపార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా కేంద్రమంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేగాదు ఈటల టార్గెట్‌గా బండి అనుచరులు పోస్టర్లు వేయడం పోలీసుల విచారణలో అదే తేలడంతో సదరు నేతను సస్పెండ్ కూడా చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్… లోకల్ పార్టీ నేతలను ఏ విధంగా ఏకతాటిపై తెస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -