- Advertisement -

మోనాలిసాకు భద్రత కల్పించండి

- Advertisement -

కుంభ‌మేళాలో పూస‌లు అమ్ముకునే ద‌శ నుంచి న‌టిగా మారిన మోనాలిసా మ‌రోసారి వార్తల్లో నిలిచింది. ఫర్మాన్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్న మోనాలిసాకు తగిన రక్షణ కల్పించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనకు ప్రాణహాని ఉందని, తనపై నమోదైన కేసుల నేపథ్యంలో రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌తో ఫేస్‌బుక్ ద్వారా మోనాలిసాకు పరిచయం ఏర్పడింది. ఎనిమిది నెలల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ తిరువనంతపురంలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు కేరళలోనే నివాసం ఉంటున్నారు. అయితే, మోనాలిసా మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్‌పై కిడ్నాప్ మరియు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసుల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని భావించిన మోనాలిసా కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు ఆమెకు తగిన భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.

ఈ వివాదానికి సంబంధించి ఈ నెల ప్రారంభంలోనే కేరళ హైకోర్టు మరొక ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా, మోనాలిసా భర్త ఫర్మాన్‌ ఖాన్‌కు నెల రోజుల పాటు ‘ట్రాన్సిట్ బెయిల్’ మంజూరు చేసింది. ఈ మతాంతర వివాహం మరియు తదనంతర పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -