- Advertisement -

విద్యార్థుల మృతిపై అవినాష్ రెడ్డి సీరియస్

- Advertisement -

విద్యార్థుల మృతిపై వైసీపీ నేత, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక గోతుల్లో పడి చ‌నిపోయిన‌ వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేశారు. ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పే వరకు తాను కూడా అక్కడ నుంచి కదలనని చెప్పారు అవినాష్.

నిన్న రాత్రి నుంచి మృతదేహాలతో ఆందోళన కొనసాగిస్తున్నారు బాధితులు, గ్రామస్తులు. వారికి మద్దతుగా కుమారకాలవ వెళ్ళి సంఘీభావం తెలిపారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.

నష్టపరిహారం అందేవరకు ఇక్కడ నుండి కదిలేదని… ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిన్నారులు మృతి చెందారని ఎంపీ మండిపడ్డారు. శాండ్ మైనింగ్ వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో బాధితులకు హామీ ఇచ్చారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. బాధిత కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం, 5 సెంట్ల భూమి అందిస్తామని హామీ ఇచ్చారు.

చక్రాయపేట అక్రమ ఇసుక క్వారీ కుంటలో పడి జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి మృతి చెందారు. చిన్నారుల మృత‌దేహాలకు నివాళులు అర్పించి వారి తల్లిదండ్రులను ఓదార్చారు అవినాష్ రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -