- Advertisement -

నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి

- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. బిహార్‌లోని ఆయన స్వగ్రామంలో ఆస్తి వివాదం నేపథ్యంలో పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా, బరౌలీ పట్టణంలోని బెల్‌సంద్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పూర్వీకుల ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా, బీజేంద్రనాథ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను స్థానికులు హుటాహుటిన గోపాల్‌గంజ్ మోడల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పాట్నాలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై గోపాల్‌గంజ్ ఎస్పీ వినయ్ తివారీ స్పందిస్తూ, దాడికి సంబంధించి ఒక నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు. అయితే, బాధితుడి కుటుంబ సభ్యుల నుండి ఇంకా రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

ఈ దాడిని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నేరస్తులెవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటి దాడులను ఏమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రముఖ నటుడి సోదరుడిపై జరిగిన ఈ దాడి ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -