- Advertisement -

యువతికి వేధింపులు.. కుటుంబం ఆత్మహత్య

- Advertisement -

స్నేహం ముసుగులో యువతిని వేధిస్తూ, పెళ్లిని అడ్డుకుంటానని బ్లాక్‌మెయిల్ చేసిన ఉల్లాస్ గౌడ అనే యువకుడి అరాచకంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహం నిశ్చయమైన యువతితో పాటు, ఆమె తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

మైసూరు జిల్లా కెంపయ్యనహుండి గ్రామానికి చెందిన రక్షితకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అయితే, రక్షితకు గతంలో పరిచయమున్న ఉల్లాస్ గౌడ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. “నిన్ను ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకోకపోతే కల్యాణ మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంటాను” అంటూ బెదిరించాడు. అంతేకాకుండా, స్నేహంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. అప్పటికే ఆ ఫోటోలను వరుడికి పంపి, వివాహం ఆగిపోయేలా కుట్ర చేశాడు.

ఈ అవమానాన్ని, ఉల్లాస్ గౌడ వేధింపులను తట్టుకోలేక రక్షితతో పాటు ఆమె తండ్రి శివణ్ణ, తల్లి నాగరత్న తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇక ఏమీ చేయలేక ముగ్గురూ విషం తాగి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు వారు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందుకున్న టి.నరసీపుర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబం వదిలి వెళ్లిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఉల్లాస్ గౌడ వేధింపులే ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పెళ్లి పనులతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో, ఈ ఘటనతో తీరని విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -