తమిళ అగ్రకథానాయకుడు, తమిళనాడు సీఎం విజయ్ను నటి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న తరుణంలో, ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో విజయ్ పుట్టినరోజున త్రిష ప్రత్యేకంగా పోస్ట్‌లు చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండేవారు. అయితే, ఈసారి విజయ్ పుట్టినరోజున త్రిష సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు. దీనికి తోడు, అకస్మాత్తుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ను అన్‌ఫాలో చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
త్రిష తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదైనా కారణం ఉందా? వారిద్దరి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తాయా? అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడం, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో వీరికి ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే, తాజాగా త్రిష చేసిన పనితో వీరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం కోలీవుడ్ మీడియాలో మొదలైంది. దీనిపై ఇప్పటివరకు ఇటు విజయ్ గానీ, అటు త్రిష గానీ ఎటువంటి స్పందనా తెలియజేయలేదు. దీనిపై అధికారిక సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
