- Advertisement -

అమ్మ మందలించిందని బిహార్‌కు ప్రయాణం

- Advertisement -

​ఆన్‌లైన్ గేమ్స్ మోజులో పడి ఇంట్లో తల్లి మందలించిందన్న కోపంతో ముగ్గురు బాలికలు ఏకంగా బిహార్‌ రైలు ఎక్కేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు వారిని సురక్షితంగా కాపాడి తల్లి ఒడికి చేర్చారు.

హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు 8, 9 తరగతులు చదువుతున్నారు. వీరు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలయ్యారు. గేమింగ్ సమయంలో బిహార్‌కు చెందిన కొందరు అపరిచితులతో వీరికి పరిచయం ఏర్పడింది. ఆటల గురించి వారితో గంటల తరబడి ముచ్చటించేవారు. గేమింగ్ వల్ల తల్లి తరచూ మందలిస్తుండటంతో, ఈ విషయాన్ని ఆ అపరిచితులతో బాలికలు పంచుకున్నారు. “ఇక్కడ మీకు ఉచితంగా గేమ్స్ ఆడుకోవచ్చు, మీకు కావాల్సిన ఫోన్లు ఇస్తాం” అని ఆ మాయగాళ్లు బాలికలకు ఆశ చూపారు.

​దీంతో ఈ నెల 22న తల్లి మందలించడంతో కోపానికి గురైన ఆ ముగ్గురు బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, బిహార్ వెళ్లే రైలు ఎక్కేశారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులోని ఐడి ఆధారంగా వారు నగరానికి చెందిన ఒక బాలుడితో గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు. విచారణలో ఆ బాలుడు బాలికలు బిహార్ వెళ్లినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రైల్వే యాప్ ద్వారా వారు వలసెక్స్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు.

​ఏలూరు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు రైలులో తనిఖీలు చేసి బాలికలను గుర్తించి కాపాడారు. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని బిహార్‌లోని ఆ అపరిచితులతో బాలికలు మాట్లాడుతున్నట్లు గుర్తించారు. సకాలంలో స్పందించి బాలికలను క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులను సీపీ సజ్జనార్ అభినందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -