- Advertisement -

అమరావతిలో బాలకృష్ణ ‘NBK 112’

- Advertisement -

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘NBK 112’ అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు.

అమరావతిలో పూజా కార్యక్రమాలుఏపీలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, మొదటిసారిగా అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ డైలాగ్‌తో సందడి చేశారు. మంత్రి కందుల దుర్గేష్, నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నార సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. 2027 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో గొప్ప లోకేషన్లు ఉన్నాయని, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు పుట్టిన ఈ నేలపై సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని బాలకృష్ణ పేర్కొన్నారు.

మొదటిసారిగా సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన నారా లోకేష్, తన ముద్దుల మామయ్య బాలకృష్ణ సినిమాకు క్లాప్ కొట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. బాలకృష్ణ నాయకత్వంలో ఏపీలో సినీ పరిశ్రమను బలోపేతం చేస్తామని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ పవిత్ర భూమిలో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -