తాడిపత్రిలో పోలీసుల తీరుపై మండిపడుతూ వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
పోలీసుల వైఖరికి నిరసనగా మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి కోర్టు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు.నేతల ఆందోళనతో కోర్టు రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు కదలకుండా పోలీసులు బ్యారికేడ్లను అడ్డుగా పెట్టి భారీగా మొహరించారు.తాడిపత్రి వెళ్లకుండా వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
