- Advertisement -

షాబాద్ నరహంతకుడు ఆత్మహత్య..

- Advertisement -

షాబాద్ లో ఆరుగురిని చంపిన నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఒకే సమయంలో ఆరుగురిని చంపిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తూరు మండలం పెంజర్లలో రాజ్ కుమార్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీ పక్కనే పాయిజన్ సీసా లభ్యం కావటంతో.. ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆరుగురిని చంపిన ఈ నరహంతకుడు కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జూలై 10న భార్యాపిల్లలతో సహా ఆరుగురిని నరరూప రాక్షసుడిలా గొంతుకోసి చంపేసి, ఆ తర్వాత పరారైన రాజ్‌కుమార్ తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పంజర్లలో ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆరుగురిని చంపిన తరువాత రాజ్ కుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించు కొని తిరుగుతున్నాడు. అతడి కోసం 12 పోలీస్ బృందాలు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పంజర్లలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10 అర్ధరాత్రి మూడు వేర్వేరు ప్రాంతాల్లో దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్‌లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మ లను నరికి చంపాడు.

కాగా, సదరు మైనర్ బాలిక ను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, కొడుకులను సైతం కిరాతకంగా మట్టుబెట్టాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సైతం కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడి కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. ఆరుగురిని చంపిన తర్వాత తాను కూడా చనిపోతున్నానని తండ్రికి ఫోన్ చేసిన రాజ్‌కుమార్, తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి, రూ.2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అయితే పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నిందితుడు చివరకు కొత్తూరులో శవమై తేలడం తో ఈ నరహంతకుడి కథ ముగిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -