- Advertisement -

జనసేనపై ప్రకాశ్‌ రాజ్ మరో బాంబు!

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆయన అత్యంత ఘాటుగా స్పందించారు. కొందరు రాజకీయ నాయకులు, సోషల్ మీడియా వేదికల ద్వారా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అయితే తాను వేటికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తనపై కట్టుకథలు అల్లుతున్న వారిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను మౌనంగా లేను, అన్ని చూస్తున్నా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ల ఇన్‌ఫ్లుయెన్స్‌తో, జనసైనికులు కొందరికి అమ్ముడుపోయిన ఛానల్స్, యూట్యూబర్స్ సోషల్ మీడియాలో కడుతున్న కట్టుకథలు, అబద్ధాలు, బూతులు అన్నీ వింటున్నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ రాజకీయ బలాన్ని, ప్రభావాన్ని ఉపయోగించి కొందరు వ్యక్తులు, మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన నేరుగా ఆరోపించారు.దిగజారడంలో మీకు మీరే సాటి..తనను విమర్శించే వారికి ఒకటే సమాధానం అంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.

మీ అందరికీ నా సమాధానం ఒక్కటే.. దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడు తనాన్ని చూస్తోంది అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అరిచినా, ఎన్ని అబద్ధపు కథలు అల్లినా సమాజాన్ని, వ్యవస్థను ప్రశ్నించే తన గొంతును ఎవరూ నొక్కలేరని ఆయన స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్ వివిధ రాజకీయ అంశాలపై, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మరియు జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జనసైనికులు, ఇతర రాజకీయ వర్గాల నుంచి ఆయనకు తీవ్ర స్థాయిలో కౌంటర్లు, ట్రోలింగ్ ఎదురవుతున్నాయి. వాటన్నిటికీ కలిపి ఆయన ఇచ్చిన ఈ తాజా కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -