- Advertisement -

నందమూరి ఫ్యామిలీ నుండి మరో పొలిటికల్ ఎంట్రీ?

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి కుటుంబానికి, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైన ఈ రాజకీయ ప్రస్థానంలో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, నందమూరి సుహాసినిలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు తమ ముద్ర వేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో మహిళా నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

దివంగత నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు, రహదారి ప్రమాదంలో అకాల మరణం చెందిన నందమూరి జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలో జానకిరామ్ జీవించి ఉన్న సమయంలో గానీ, లేదా ఆయన మరణించిన తర్వాత గానీ దీపిక ఎప్పుడూ సినిమా వేడుకల్లో లేదా రాజకీయ వేదికలపై పెద్దగా కనిపించలేదు. గతంలో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేసిన సందర్భంలో మాత్రమే ఆమె తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఇటీవల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తన కుమారుడు (జూనియర్ ఎన్టీఆర్) హీరోగా పరిచయమవుతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కనిపించారు. అయితే గత రెండు వారాలుగా ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా నందమూరి దీపిక అధికారికంగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణ, జానకిరామ్ ఫోటోలతో పాటు తెలుగుదేశం పార్టీ పోస్టర్లను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్నారు.

నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఒక్కసారిగా జనాల్లోకి వస్తూ, సేవా కార్యక్రమాలు పెంచుతూ, పార్టీ సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుండటంతో నందమూరి అభిమానుల్లో మరియు టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది.

దీపిక రాబోయే రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార బాధ్యతలు మాత్రమే చేపడతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -