- Advertisement -

పొగాకు రైతులకు మద్దతుగా రంగంలోకి జగన్…

- Advertisement -

మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం ప్రకటించారు. రైతులకు పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పొగాకు రైతుల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే.. తానే నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. వారికి మద్దతుగా పోరాటం తీవ్ర తరం చేస్తానని హెచ్చరిక చేసారు. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో పర్యటిస్తానని వెల్లడించారు. ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వైసీపీ చూస్తూ ఊరుకోదని.. వారికి మద్దతుగా పోరాటం చేస్తుందని జగన్ తేల్చి చెప్పారు.

పొగాకు రైతులతో మాజీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించారు. గోపాలపురం లేదా జంగారెడ్డి గూడెంలో పొగాకు రైతులను కలుస్తానని చెప్పారు. ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆ తరువాత కూడా ప్రభుత్వం స్పందించక పోతే కందుకూరులో మరో పర్యటన చేస్తానని చెప్పారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 2332 మిలియన్ కిలోల పొగాకు పండితే ఇప్పటి వరకు కేవలం 38 మిలియన్ కిలోల మాత్రమే కొనుగోలు చేసారని జగన్ చెప్పారు. సాధారణంగా వంద రోజుల్లో పూర్తి కావాల్సిన కొనుగోలు ప్రక్రియలో 94 రోజులు గడిచినా అయిదో వంతు కూడా కొనకపోవటం ప్రభుత్వ వైఫల్యం గా పేర్కొన్నారు.

సెప్టెంబర్ లో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పొగాకు ధర రూ 200 తగ్గకూడదని చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజునే మార్కెట్ లో ధరలు పడిపోయాయని గుర్తు చేసారు. దీని ద్వారా వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏ జిల్లాలో ఏ పంట కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా పండిన పంటంలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేసారని జగన్ వివరించారు.రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -