- Advertisement -

మరో పోరాటానికి సిద్దమైన వైసీపీ, ముహూర్తం ఫిక్స్..

- Advertisement -

మరో పోరాటానికి వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే రైతులకు మద్దతుగా మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆక్వా రైతుల కోసం భీమవరం సభలో పాల్గొన్న జగన్ తాజాగా పొగాకు రైతుల విషయంలో ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కాగా, ఇప్పుడు యువత.. విద్యార్ధులకు సంబంధించిన అంశాల పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు నిర్ణయించారు. ముహూర్తం ఖరారు చేసారు.

వైసీపీ మరో పోరాటానికి నిర్ణయించింది. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనుంది. డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల అంశాల పైన వైసీపీ పోరుకు సిద్దమైంది. ఈ మేరకు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా కీలక ప్రకటన చేసారు. రాష్ట్రంలో కోటి మంది యువత ఉన్నారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారని.. ఈ లెక్కన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి రూ 72 వేల కోట్లు బకాయి పడ్డారని వివరించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను సాక్షాలతో సహా బయట పెట్టామని.. అయినా, చంద్రబాబు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న యువత ఆవేశం గర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు యువత ఆశయాలను..ఆలోచనలను అర్దం చేసుకోవటం లేదని చెప్పుకొచ్చారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేసారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా లక్షలాది మంది విద్యార్ధులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ నిరసన కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ నెల 28న వైసీపీ యూత్, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్ట్ కొనసాగుతుందని రాజా స్పష్టం చేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -