- Advertisement -

నీట్ పేపర్ లీక్ ప్రకంపనల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

- Advertisement -

రాజధాని ఢిల్లీ నిరసనలతో హోరెత్తుతోంది. జంతర్ మంతర్ అట్టుడుకుతోంది. కేంద్రం- కాక్రోచ్ పార్టీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నా ఇంకా తుది ఫలితం రాలేదు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం సీజేపీ పట్టు బడుతోంది. కేంద్రం మాత్రం ఆ ఒక్కటి మినహా అన్నింటికీ ఓకే అని చెబుతోంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు పరీక్ష పత్రాల లీక్ చేసిన వారి శిక్షల పైన కఠిన చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేలా చట్టాన్ని మరింత బలోపేతం చేసే సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పేపర్ లీక్ కేసుల దర్యాప్తు, విచారణను తప్పనిసరిగా మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులకు చట్టబద్ధ హోదా కల్పించనున్నారు. అలాగే వ్యవస్థీకృత పేపర్ లీక్ సిండికేట్‌లకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించేలా నిబంధన తీసుకొచ్చారు.

ఈ కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగకుండా, ఏడాది లోపే నిందితులకు శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అందుబాటులోకి రాగా, మిగిలిన ప్రధాన కేంద్రాల్లో కూడా వీటిని త్వరలోనే ప్రారంభించేలా నిర్ణయించారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విచారణ ప్రక్రియను వేగవంతం చేసి నిందితులకు తక్షణమే శిక్షపడేలా చూడడమే ఈ కొత్త బిల్లు ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు. ఈ బిల్లును సోమవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -