- Advertisement -

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.భారతదేశంలో అత్యధిక కాలం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ క్రమంలో జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. ఇక ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

()అమరావతి నూతన రాజధానిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ ఆఫీస్

()అకామొడేషన్ (CGGPOA) నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.

()అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగు.

()వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

()శాఖల మధ్య సమన్వయం పెరిగి పరిపాలనా సామర్థ్యం మెరుగుపడనుంది.

()ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ సేవల అందుబాటు మరింత సమర్థవంతంగా మారనుంది.

()5.53 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం నిర్మాణం.

()సి-9, సి-8 ప్లాట్లలో రెండు భారీ భవనాల నిర్మాణం.

()సుమారు 8,000 మంది అధికారులు, సిబ్బందికి కార్యాలయ వసతి కల్పన.

() 1,800 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో పోడియం పార్కింగ్ ఏర్పాటు.

()మొత్తం 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం.

()గ్రీహా (GRIHA) 4-స్టార్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణం.

()ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ (ECSBC)-2024 నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టు.

()నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యం.

()బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీస్, క్రెచ్, వినోద కేంద్రం వంటి సౌకర్యాలు.

() 100 మంది సామర్థ్యంతో కాన్ఫరెన్స్ హాల్, 500 మంది సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు.

()ఉద్యోగులు, సందర్శకుల కోసం నాలుగు క్యాంటీన్లు.

()దివ్యాంగులకు పూర్తిగా అందుబాటులో ఉండే బారియర్-ఫ్రీ క్యాంపస్.

()నిర్మాణ దశలో ఏడాదికి సుమారు 7 లక్షల మానవ-పని దినాల ఉపాధి.

()నిర్వహణ దశలో ఏడాదికి సుమారు 50 వేల మానవ-పని దినాల ఉపాధి.

()ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,299.08 కోట్లు.

()కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులతో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం.

() సీపీడబ్ల్యూఢీ ద్వారా ప్రాజెక్టు అమలు.

()టెండర్ ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక చర్యలు ఇప్పటికే ప్రారంభం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -