- Advertisement -

దేశ రాజధానిలో మ‌రో నిర్భయ ఘ‌ట‌న‌!

- Advertisement -

దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 11వ తరగతి బాలికపై ప్రైవేట్ స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘోర ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా స్వీకరించిన కమిషన్, బాధితురాలిపై అత్యాచారం జరిగిన బస్సును స్వయంగా పరిశీలించింది.

ఈ దారుణానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్, మైన్‌పురి ఎస్పీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. విచారణ పురోగతి, బాధితురాలికి అందించిన పరిహార వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 16 ఏళ్ల బాలిక ఆగస్టు 4న ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడా సెక్టార్-63లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పొరపాటున గ్రేటర్ నోయిడా పరిచౌక్ వద్ద దిగింది. వర్షంలో నిలబడి ఉన్న బాలికను ‘విశ్వనాథ్’ ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26) నమ్మించి ఎక్కించుకున్నారు.

బాధితురాలు ఒంటరిగా ఉందని గుర్తించిన నిందితులు బస్సు కర్టెన్లు మూసివేశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి కశ్మీరీ గేట్ వద్ద ఆమెను వదిలి పరారయ్యారు. రక్తమోడుతున్న బాధితురాలు ధైర్యం చేసి ఆటోలో సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ నూతన ‘నిర్భయ’ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మహిళా భద్రతా వైఫల్యాలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పోలీసులు మార్గమధ్యలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులిద్దరినీ గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, జాతీయ మీడియాలో కథనాలు రావడంతో సెప్టెంబర్ 1న ఎన్‌హెచ్‌ఆర్‌సీ రంగంలోకి దిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -