- Advertisement -

NZ VS INS: హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!

- Advertisement -

త్వరలో టీమ్‌ఇండియా వరుస అంతర్జాతీయ సిరీస్‌లతో బిజీగా గడపనుంది. సెప్టెంబరు 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఆ వెంటనే న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఆతిథ్య కివీస్ జట్టుతో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లలో హోరాహోరీగా తలపడనుంది.

అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే తొలి టీ20తో టీమ్‌ఇండియా కివీస్ టూర్ అధికారికంగా మొదలుకానుంది. రెండో టీ20 మ్యాచ్ కూడా ఇదే వేదికలో జరగనుంది. సుమారు 2019 తర్వాత తొలిసారి భారత జట్టు పూర్తి స్థాయి పర్యటన కోసం న్యూజిలాండ్‌కు వెళ్తుండటంతో మ్యాచ్‌లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

సోమవారం నుంచి సాధారణ ప్రజల కోసం మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే రెండో టీ20తో సహా పలు మ్యాచ్‌ల టికెట్లు దాదాపుగా అమ్ముడయ్యాయి. ఇప్పటికే 75 శాతానికి పైగా టికెట్లు అరెసరు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 30న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనున్న నాలుగో టీ20కి అత్యధిక డిమాండ్ ఉంది. దీంతో క్రికెట్ చరిత్రలో తొలిసారిగా స్టేడియం ఆరో అంచె సీటింగ్‌ను తెరవాల్సి వచ్చిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

న్యూజిలాండ్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే:

టీ20 సిరీస్:

అక్టోబర్ 22: తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)

అక్టోబర్ 24: రెండో టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)

అక్టోబర్ 27: మూడో టీ20 (వెల్లింగ్టన్)

అక్టోబర్ 30: నాలుగో టీ20 (ఆక్లాండ్)

నవంబర్ 1: ఐదో టీ20 (హామిల్టన్)

వన్డే సిరీస్:

నవంబర్ 4: తొలి వన్డే (ఆక్లాండ్)

నవంబర్ 7: రెండో వన్డే (వెల్లింగ్టన్)

నవంబర్ 10: మూడో వన్డే (హామిల్టన్)

నవంబర్ 13: నాలుగో వన్డే (మౌంట్ మౌంగనుయి)

నవంబర్ 15: ఐదో వన్డే (మౌంట్ మౌంగనుయి)

టెస్టు సిరీస్:

నవంబర్ 19-23: తొలి టెస్టు (వెల్లింగ్టన్)

నవంబర్ 27 – డిసెంబరు 1: రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -