నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీపై వచ్చిన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా విమర్శలు ఆగడంలేదు. ప్రధానంగా జగన్, రోజానె టీడీపీ మంత్రులు, నాయకులు టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి అయ్యన్న పాత్రుడు వారిద్దరిపై దారునమైన వ్యాఖ్యలు చేశారు.
రోజా అంటేనే ఓ దరిద్రం అని… ఆమె ఎక్కడ అడుగు పెడితే, అక్కడ నాశనమే అని అన్నారు. రోజా మాట్లాడుతున్న మాటలకు ఆడవారే సిగ్గుతో తలదించుకుంటున్నారని విమర్శించారు. జబర్దస్త్ షోలో డాన్సులు చేసుకునే రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత కూడా లేదని అన్నారు.
తర్వరలోనె జగన్ వైసీపీ జెండా పీకేసి డ్రామా ట్రూప్ పెట్టడం ఖాయమన్నారు. రోజా ఆ డ్రామా ట్రూప్లో రికార్డింగ్ డాన్సులు చేయడం తథ్యమని ఆయ్యన్న వ్యాఖ్యానించారు. నంద్యాల గెలుపుతో పక్క పార్టీల నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు.
